Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ తీసుకురావడంపై దృష్టి సారించింది. గతంలో జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా యువకులను నియమించింది. ఇప్పుడు నూతన మద్యం పాలసీలో టెండర్లు నిర్వహించి కొత్త షాపులు ప్రయివేటుగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో ఆ యువకుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో వారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
తాజాగా ఇదే విషయమై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొందరు యువకులు కలిశారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ను ఆపి వినతి పత్రం అందించిన మద్యం షాపుల్లో పనిచేసే యువకులు.. తమకు న్యాయం చేయాలని కోరారు.
రేణిగుంట విమానాశ్రయం నుంచి అన్నమయ్య జిల్లాకు రోడ్డు మార్గాన బయలుదేరుతున్న పవన్ కళ్యాణ్.. రేణిగుంట కట్ట పుట్టాలమ్మ గుడి వద్దకు చేరుకోగానే మద్యం షాపుల్లో పని చేసే యువకులు అక్కడికి వెళ్లారు.
మద్యం షాపుల్లో పనిచేస్తున్న యువకులు చంద్రబాబు నాయుడుని, లోకేష్ ని, మరియు కొల్లు రవీంద్రను కలిశామని చెప్కపారు. తమకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వలేదని వారు పవన్ కళ్యాణ్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుంచి వినతి పత్రం తీసుకున్న పవన్.. మీ సమస్యలను ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రోడ్డు మార్గాన అన్నమయ్య జిల్లాకు కారులో బయలుదేరి వెళ్లారు.
ఇవీ చదవండి: Andhra Pradesh: రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చుతాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Nadendla Manohar: ధాన్యం కొనుగోళ్లపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..
Chandrababu: కొత్త పారిశ్రామిక విధానంతో దేశం మనవైపు చూడాలి: సీఎం చంద్రబాబు
Cholesterol: మనిషికి కొలెస్ట్రాల్ అధికమైతే ఏమవుతుంది?