Vote: ”ప్రస్తుత పరిస్థితుల్లో ‘నోటా’కు నామమాత్రపు ప్రాముఖ్యమే ఉంది. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపదు. ఒక స్థానంలో 100 ఓట్లలో నోటాకు 99, అభ్యర్థికి ఒక ఓటు వచ్చినా.. అభ్యర్థే విజేతగా నిలుస్తారు. ఒకవేళ నోటాకు 50 శాతానికిపైగా ఓట్లు వస్తే.. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను తాము అర్హులుగా పరిగణించడం లేదని ఓటర్లు చాటుతున్నట్లే.
దీంతో పార్లమెంటు, ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఎన్నికల ఫలితాలపై ఈ ఓట్లను ప్రభావితం చేయడానికి చట్టాలను మార్చడం గురించి వారు ఆలోచించాల్సి ఉంటుంది” అని ఓపీ రావత్ తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇందౌర్‌లో 5045 ఈ ఓట్లు నమోదయ్యాయి.
పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు నచ్చకపోతే నోటాకు వేయాలనే ఆప్షన్ ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చివరి క్షణంలో నామినేషన్ ఉపసంహరించుకుని, భాజపాలో చేరిపోవడంతో హస్తం పార్టీ పోటీలో లేకుండా పోయింది. దీంతో పోటీలో ఉన్న వారెవరికీ మద్దతు ప్రకటించకుండా.. ‘నోటా’ కు ఓటెయాలని చెపుతున్నారు. ఎన్నికల ఫలితాలపై ‘నోటా’ ప్రభావం నామమాత్రమేనని మాజీ సీఈసీ ఓపీ రావత్ తెలిపారు. ఒకవేళ దీనికి 50 శాతానికిపైగా ఓట్లు వస్తే మాత్రం.. ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం పడేలా చర్యలు తీసుకోవడంపై ఆలోచించాల్సి ఉంటుందన్నారు.
భారత్‌లో 2013 వరకు అభ్యర్థులు నచ్చకున్నా, సరైనవారు పోటీలో లేరని భావించినా.. ఎవరికో ఒకరికి ఓటేయాల్సిన పరిస్థితి ఉండేది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి.. 2013లో ‘నోటా’ను ప్రవేశపెట్టారు. ఆ ఏడాది దిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా దీనిని అమలు చేశారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో దీనికి సగటున రెండు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఏకంగా 51,660 మంది దీనికి ఓటేశారు. పోలైన మొత్తం ఓట్లలో ఇవి ఐదు శాతంతో సమానం.
ఇవీ చదవండి: Gudivada Amarnath: మీ హయాంలో పోర్టులు, మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టలేదు?
Varudhu Kalyani: మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు? : వరుదు కళ్యాణి ప్రశ్న
CM Revanth with Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
Cinema Producers: ఏపీ ఉపముఖ్యమంత్రితో సినిమా పెద్దల భేటీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ దృష్టికి అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది సమస్యలు