HomeరాజకీయాలుRevanth Reddy: రాజన్న ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభానికి శృంగేరి పీఠం అనుమతి కోసం ప్రత్యేక...

Revanth Reddy: రాజన్న ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభానికి శృంగేరి పీఠం అనుమతి కోసం ప్రత్యేక బృందం

Revanth Reddy: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారి దేవాలయ అభివృద్ది పనులు ప్రారంభించేందుకు శృంగేరి పిఠం వారి ఆజ్ఞ కోసం ఉన్నత స్థాయి బృందం శృంగేరి చేరుకుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ బృందం వెళ్లింది.

ఈ బృందంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి (ఓఎస్డీ) వేముల శ్రీనివాసులు, రాజన్న దేవస్థానం ఈవో వినోద్ రెడ్డి, దేవాదాయ శాఖ స్థపతి వల్లీనాయగం, శృంగేరి పీఠం తెలంగాణ భాధ్యులు రాధాకృష్ణ, దేవస్థానం అధికారులు, అర్చకులు ఉన్నారు.

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో రూ.50 కోట్ల నిధులు కేటాయించింది. వేములవాడ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఆలయ అర్చకులు, అధికారులు ఆగస్టు 30న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో శృంగేరి పీఠం అనుమతి అంశం చర్చకు వచ్చింది. వెంటనే అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు ఉన్నత స్థాయి బృందం శృంగేరి వెళ్లింది.

ఇవీ చదవండి: Jr NTR: ముంబైలో దేవర.. అంతటా ట్రైలర్ మూడ్!
Gudlavalleru: హిడెన్ కెమెరాల ఆరోపణలపై ఎలాంటి స్పై కెమెరాలు గుర్తించలేదు: ఏలూరు రేంజ్ ఐజీ
Pawan Kalyan: వరద బాధితులకు పవన్ రూ.కోటి విరాళం
Devara: అనిరుధ్ స్పెషల్.. దేవర కొత్త వీడియో సాంగ్ ఇక్కడ చూసేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News