YSRCP: ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైయస్సార్ సీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీతా రాజీనామా చేయనున్నారు. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేయనున్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణను పోతుల సునీత ప్రకటించనున్నారు.
మరోవైపు రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభకు కూడా మోపిదేవి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో అనుచరులతో మోపిదేవి భేటీ కానున్నారు. ఇప్పటికే వైయస్సార్ సీపీకి మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాలి గిరిధర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న వైయస్సార్ సీపీ నుంచి లోకేష్ సమక్షంలో ఏలూరు మేయర్ నూర్జహాన్ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
Read also: Rammohan Naidu: కొప్పర్తి, ఓర్వకల్లులో పారిశ్రామిక కారిడార్లు
YS Jagan: ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్
Varudhu Kalyani: హోంమంత్రి అనితపై వరుదు కల్యాణి కీలక వ్యాఖ్యలు