YSRCP: ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించారు. మంగళగిరిలో ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి ఫిర్యాదు చేయడం వల్లే అధికారులను మార్చారని నేతలు చెప్పారు. సిట్ చీఫ్ ఐజీ వినీత్ త్వరలో ఫైనల్ రిపోర్ట్ ఇస్తారని భావిస్తున్నామన్నారు.
అన్ని విషయాలను సిట్ అధికారులకు చెప్పామని వైసీపీ నేతలు తెలిపారు. జిల్లాల్లో పూర్తి అవగాహన ఉన్న అధికారులను మార్చడం వల్లే హింస జరిగిందన్నారు. పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. టీడీపీతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. టీడీపీ హింసకు పాల్పడితే తిరిగి మాపై తప్పుడు కేసులు పెట్టారని వాపోయారు.
ఎక్కడైతే అధికారులను మార్చారో వారిసే సస్పెండ్ చేశారన్నారు. పోలీసుల కాల్ డేటాను కూడా పరిశీలించాలని కోరామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నామన్నారు. ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని, తప్పు చేసిన అధికారులను శిక్షించాలన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి కూటమి కుట్రలు పన్నిందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. వైఎస్ జగన్ ను ఓడించడం కోసం విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ది చెబుతామని వైసీపీ నేతలు చెప్పారు.
Read Also: YSRCP: జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు: మంత్రి బొత్స
Palnadu: పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు
Botcha: మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే : మంత్రి బొత్స
Special Investigation Team: డీఎస్పీల నేతృత్వంలో రంగంలోకి దిగిన సిట్