Botcha: ఏపీలో మళ్లీ అధికారం తమదేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలో అయితే అధికారులను మార్చారో…అక్కడే హింస జరిగిందని గుర్తు చేశారు. టార్గెట్ 175 సీట్లకి దగ్గరగా గెలవబోతున్నామని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో 34కి 34 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. హింసా ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు.
రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నామన్నారు. అనవసరంగా మాపై నిందలు వేయడం సరికాదని చెప్పారు. హింసాకాండకు వైఎస్‌ఆర్ సీపీ పూర్తి వ్యతిరేకం అని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం జరుగుతుందని స్పష్టం చేశారు. విశాఖలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలన్నారు బొత్స.
విజయవాడ సీపీని కలిసిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్
వైఎస్ఆర్సీపీ నేతల పై దాడులు, అక్రమ కేసుల పై సీపీ పీహెచ్‌డీ రామకృష్ణకు వైయస్సార్ సీపీ లీగల్ సెల్ వినతిపత్రం ఇచ్చింది. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్సీపీ శ్రేణుల పై దాడులు పెరిగాయని ప్రస్తావించారు. కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దృష్టికి తెచ్చారు.
కావాలనే బైండోవర్‌లు పెట్టి వేధిస్తున్నారన్నారు. నిన్న సీఎం విజయవాడ పర్యటన సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలను స్టేషన్ కు పిలిపించి నిర్భంధించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలను అకారణంగా నిర్భంధించిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నేతలు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: Report: ఏపీలో ఎన్నికల తర్వాత హింస పై సీఈసీకి నివేదిక
SIT: హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం
Mrunal Thakur: యువ హీరోతో మృణాల్ ఠాకూర్ డేటింగ్? అసలు సంగతి ఏంటి?
Vijay: విజయ్ ‘గోట్’కు ‘అవతార్’ ఎక్స్‌పర్టుల విజువల్స్!
[…] […]