Counting: ఏపీలో కౌంటింగ్ కు సర్వం సిద్ధం అయ్యింది. వైయస్సార్ జిల్లాలోని మౌలానా అబ్దుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలో కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం జరగనుంది. ప్రతి నియోజకవర్గంలో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు పోల్ అయిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 22,669గా ఉన్నాయి. కడప పార్లమెంట్ కు పోల్ అయిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 22,657.
కడపలో పోలింగ్ స్టేషన్స్ 287 కాగా, వీటిలో 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. బద్వేల్ లో పోలింగ్ స్టేషన్స్ 272 కాగా, 20 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఇక సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో పోలింగ్ స్టేషన్స్ 301 కాగా, వీటిలో 22 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మరోవైపు కమలాపురంలో పోలింగ్ స్టేషన్స్ 251, రౌండ్స్ 18, జమ్మలమడుగులో పోలింగ్ స్టేషన్స్ 315, రౌండ్స్ 23. ప్రొద్దుటూరులో పోలింగ్ స్టేషన్స్ 268, రౌండ్స్ 20 – మైదుకూరులో పోలింగ్ స్టేషన్స్ 269, రౌండ్స్ 20 ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద రెడ్ జోన్ గా ప్రకటన చేసింది ఈసీ.
శ్రీకాకుళం జిల్లాలో…
శ్రీకాకుళం జిల్లాలో కౌంటింగ్ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 8 నియోజకవర్గాలకు సంబంధించి 17 హాల్స్ ఏర్పాటు చేశారు. 8 నియోజకవర్గాలకు 112 టేబుల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. 8 నియోజకవర్గాల్లో బరిలో 86 మంది అభ్యర్థులు నిలిచారు. కౌంటింగ్ విధుల్లో 2,000 మంది సిబ్బంది ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 1,459 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.
ఉదయం 8 గంటల నుంచే…
రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాకు కౌంటింగ్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 25 హాళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు 350 హాళ్లు ఏర్పాటు చేశారు. 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు అయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి ఉండదు. అభ్యర్ధుల ఇళ్లు, సున్నిత ప్రాంతాల్లో భద్రతను ఇప్పటికే పెంచారు.
Read Also: Actor Hema: రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసుల అదుపులో నటి హేమ
MLC Kavitha: ఈడీ ఛార్జ్ షీట్‌లో కవిత స్టేట్ మెంట్ రికార్డ్
Counting: ఏపీలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. ఏ నియోజకవర్గం ఎన్ని రౌండ్లు?
SSMB 29: మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా జాన్వీ కపూర్?
Gangs of Godavari: విష్వక్‌సేన్ సినిమా కలెక్షన్ల వర్షం.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?