HomeరాజకీయాలుAAP: బీజేపీ, ఆప్ పార్టీల మధ్య మాటల మంటలు

AAP: బీజేపీ, ఆప్ పార్టీల మధ్య మాటల మంటలు

AAP: ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, ఆప్‌ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆప్ మంత్రులు అతిశీ, సౌరభ్ భరద్వాజ్ సహా ఎంపీ రాఘవ్ చడ్డా జైలుకు వెళ్తారంటూ బీజేపీ సీనియర్ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆప్ నేతల అరెస్టుపై కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీకి సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ ఆఫీసుముట్టడికి ఆప్ ఎంపీలు, కీలక నేతలు ప్రయత్నించారు.

ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఆప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యాలయానికి ఆప్ నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్ అరెస్ట్ పై నిరసన తెలిపారు. నేతలు, కార్యకర్తలతో ఆ ప్రాంతం కోలాహలంగా మారిపోయింది. బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు ఆప్ నేతలు ప్రయత్నించారు. కేజ్రీవాల్ సహా అప్ నేతలను పోలీసులు అడ్డగించారు. డీడీయూ మార్గ్ లో 144 సెక్షన్ విధించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బీజేపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. నిన్న నిందితుడు బిభవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. బిభవ్ ను తీస్ హాజారీ కోర్టులో హాజరు పరిచారు.

ఆప్ నేతలపై వేధింపులను వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యాలయం వద్ద ఆప్‌ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ నిరసనకారులను ఢిల్లీ పోలీసులు చెదరగొట్టారు. ఐటీవో మెట్రోస్టేషన్ తాత్కాలికంగా మూత వేశారు.

బిభవ్ కుమార్‌కు రిమాండ్
కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ను ఐదు రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో బిభవ్‌ అరెస్ట్ అయ్యారు. బిభవ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. బిభవ్ ఇచ్చిన సెల్ ఫోన్ లో డేటా డిలీట్ అయినట్లు గుర్తించారు. మొబైల్ డేటా రికవరీ చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఇవీ చదవండి: CM Kejriwal: మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు
CM Kejriwal: మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు
PM Modi: సీఏఏపై ప్రతిపక్షాలది దుష్ప్రచారం: ప్రధాని మోదీ మండిపాటు
Kejriwal: 75 ఏళ్లకు ప్రధాని మోదీ రిటైర్ అవుతారు : కేజ్రీవాల్
Warning: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిఘా విభాగం హెచ్చరికలు

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News