Elections: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రేపటితో ముగియనుంది. రేపు లోక్‌సభ ఎన్నికల ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఏడో విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. ఏడో విడతలో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 57 స్థానాల్లో 41 జనరల్, 3 ఎస్టీ, 13 ఎస్సీ రిజర్వ్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఎన్నికల కోసం 10.09 లక్షల మంది పోలింగ్ సిబ్బంది పని చేయనున్నారు.
10.06 కోట్ల మంది ఓటర్లలో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళా ఓటర్లు, 3,574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఏడో విడత ఎన్నికల కోసం 172 మంది ఎన్నికల పరిశీలకులను ఈసీ నియమించింది. 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను సీఈసీ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తి అయ్యింది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కౌంటింగ్‌కు సైతం ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
Read Also: Elections: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
AB Venkateswara Rao: ఎట్టకేలకు ఏబీవీకి పోస్టింగ్, బాధ్యతలు, రిటైర్‌మెంట్!
YS Jagan: లండన్ నుంచి రేపు ఏపీకి సీఎం జగన్
Delhi Temperature: ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. నిన్న 52.3 డిగ్రీలు నమోదు
Hardik Pandya: షాకింగ్.. హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకుంటున్నారా?