TG Cabinet: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈసీ అనుమతితో ఇవాళ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన దాదాపు 3 గంటలకు పైగా ఈ భేటీ కొనసాగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 2న తెలంగాణ అవతరణ వేడుకలను వైభవంగా జరపాలని నిర్ణయించిరు. ఈ వేడుకలకు ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీని పిలవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఇక ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకూ కొనాలని ముఖ్యమంత్రి ఆదేశిచంఇనట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్‌బాబు తెలిపారు. మంత్రివర్గం నిర్ణయాలను వారు వెల్లడించారు.
* అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని కేబినెట్ నిర్ణయం
* MSP కంటే ఒక్క రూపాయీ తక్కువ చెల్లించకూడదని మంత్రివర్గం నిర్ణయం
* రాష్ట్రానికి అవసరమైన సన్న బియ్యం అంతా ఇక్కడే సేకరించేలా నిర్ణయం
* సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయం
* నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం
* ప్రభుత్వ బడుల ఆధునికీకరణ కోసం రూ.600 కోట్లు కేటాయించేలా నిర్ణయం
* అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు
* కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
* మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఏం చెప్తే అది చేయాలని కేబినెట్ అభిప్రాయం
ఇవీ చదవండి: CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ నజర్.. కీలక సమీక్ష
KTR: రెండు లక్షల ఉద్యోగాలేవీ? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
KCR: రైతు వ్యతిరేక కాంగ్రెస్ చర్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు: కేసీఆర్
Andhra Pradesh: ఏపీ అల్లర్లపై సిట్ నివేదికలో కీలక అంశాలు
YSRCP: అధికారులను మార్చిన చోటే హింస జరిగింది: వైఎస్సార్‌సీపీ నేతలు
Bengaluru Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు నటులు, టెకీలు!
[…] […]