TDP: ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో అల్లర్లు జరుగుతున్న క్రమంలో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై టీడీపీ పుస్తకం రిలీజ్ చేసింది.
పుస్తకాన్ని టీడీపీ నేతలు ఆవిష్కరించారు. పిన్నెల్లి సోదరులు మాచర్లలో మారణహోమం సృష్టించారని టీడీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ ను నామరూపాలు లేకుండా చేశారన్ననారు. జగన్ వచ్చిన తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ దాడులు మొదలయ్యాయని ఆరోపించారు. మాచర్లలో టీడీపీ గెలుస్తుందని తెలిసే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. పాస్ పుస్తకాలు అప్లయ్ చేసిన వారి వివరాలు వెంటనే పిన్నెల్లికి వెళ్లిపోతాయని ఆరోపించారు. ఆఖరికి పాస్ పుస్తకాల్లో కూడా రూ.15 వేలు దోచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని, ప్రజల్లో చైతన్యం రాబట్టే….పిన్నెల్లి పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పారిపోయారన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఉన్నన్నాళ్లు మంచి చేయాలంటూ చెప్పుకొచ్చారు. మంచి చేయకపోతే అధికారం కోల్పోయేలా గుణపాఠం చెబుతారంటూ టీడీపీ నేతలు తెలిపారు.
ఇవీ చదవండి: NKR 21: నందమూరి కల్యాణ్ రామ్ 21వ మూవీ గ్లింప్స్.. అదిరిపోయిన ట్విస్ట్
NTR: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు నోటీసులు
Rains: కేరళ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Manchu Lakshmi: రేవ్ పార్టీపై మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు