KCR: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు చేపడుతోందని, ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్రవ్యాప్త నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.
పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం అన్నదాతలను మోసగించడమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని తెలిపారు. ఈ విషయం తెలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎలా ప్రకటిస్తుందని మండిపడ్డారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం దగా చేయడమేనన్నారు.
దీంతో తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచించిందని ధ్వజమెత్తారు. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందన్నారు. అందుకే నాలిక మడతేసి ఎప్పటి మాదిరిగానే నయవంచన చేసేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్లని కామెంట్ చేశారు.
ఇవీ చదవండి: PM Modi: సీఏఏపై ప్రతిపక్షాలది దుష్ప్రచారం: ప్రధాని మోదీ మండిపాటు
Kejriwal: 75 ఏళ్లకు ప్రధాని మోదీ రిటైర్ అవుతారు : కేజ్రీవాల్
Kejriwal: 75 ఏళ్లకు ప్రధాని మోదీ రిటైర్ అవుతారు : కేజ్రీవాల్
YSRCP: జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు: మంత్రి బొత్స
Chandrababu: దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం: చంద్రబాబు
[…] […]