MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితపై అభియోగాలను ఈడీ నమోదు చేసింది. అందులో పలు కీలక విషయాలను ఆమె ప్రస్తావించారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో తన తరఫున పాల్గొనాలని బుచ్చిబాబుకు అథరైజేషన్ ఇవ్వలేదని కవిత పేర్కొన్నారు. ఇండో స్పిరిట్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా తనకు ఎలాంటి వాటా లేదని కవిత స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి తాను ఎవరితోనూ మాట్లాడలేదన్నారు కవిత. బుచ్చిబాబు, రాఘవ మధ్య జరిగిన సంభాషణలు తనకు తెలియవన్నారు. వాళ్ల ఫోన్ నెంబర్లు కూడా తనకు తెలియదన్నారు. తన తరఫున ఎవరూ ఆప్ ను సంప్రదించలేదని, లంచాలు ఇవ్వలేదన్నారు. అరుణ్ పిళ్లై నా ఫ్యామిలీ ఫ్రెండ్ అని, వీకెండ్లలో తరుచూ కలుస్తుంటామన్నారు. అరుణ్ పిళ్లై ఇచ్చిన స్టేట్ మెంట్లతో తనకు సంబంధం లేదని కవిత పేర్కొనడం గమనార్హం.
ఇండో స్పిరిట్ లో అరుణ్ పిళ్లై తన తరఫున కార్యక్రమాలు నిర్వహించలేదని కవిత చెప్పారు. ఇండియా హెడ్ న్యూస్ ఛానల్ లో అభిషేక్ కు వాటాలు ఉన్నాయని తనకు తెలియదన్నారు. ఇండియా హెడ్ న్యూస్ ఛానల్ లో పెట్టుబడులు పెట్టాలని గౌతమ్ ముత్తు తనను కోరారని కవిత చెప్పారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి చాలాసార్లు కలిశారని, మాగుంట రాఘవ రెడ్డిని ఒక్కసారి మాత్రమే కలిశానన్నారు కవి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మే 10న కవితపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ.. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలు కాకుండా కొత్త విషయాలు కూడా చార్జ్ షీట్ లో పొందుపరిచింది. మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాలను పొందుపరిచింది ఈడీ. వారితోపాటు కవిత పాత్ర పై ఇతరుల నిందితులు చెప్పిన అంశాలను చార్జిషీట్ లో పొందుపరిచింది.
ముగ్గురి వాంగ్మూలాల్లోనూ కవితకు వ్యతిరేకంగా పలు అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలిశాక ఆయన కవితతో కలిసి పనిచేయమని చెప్పారని మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డితో ఫేస్ టైంలో కవిత మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఇద్దరూ సమావేశమయ్యారు.
రూ.100 కోట్లు ఇస్తే మద్యం విధానంలో సాయం చేస్తానని కేజ్రీవాల్ చెప్పారని కవిత తనతో చెప్పినట్లు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను బిజీగా ఉంటాను కాబట్టి తన కుమారుడు రాఘవ డబ్బు సమకూర్చే వ్యవహారాలు చూసుకున్నారని మాగుంట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గోవా, పంజాబ్ ఎన్నికల కోసం రూ.100 కోట్లు కేజ్రీవాల్ అడిగారని కవిత చెప్పినట్లు మాగుంట రాఘవ పేర్కొన్నాడు.
Read also: MLC Kavitha: కవితపై దాఖలైన ఛార్జ్‌షీట్ పరిగణనలోకి..
Kejriwal: తీహార్ జైలులో లొంగిపోనున్న కేజ్రీవాల్
Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
Kejriwal: 75 ఏళ్లకు ప్రధాని మోదీ రిటైర్ అవుతారు : కేజ్రీవాల్
Delhi Temperature: ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. నిన్న 52.3 డిగ్రీలు నమోదు