Special Investigation Team: పోలింగ్ అనంతరం ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన సంగతి తెలిసిందే. డీఎస్పీల నేతృత్వంలోని సిట్.. రంగంలోకి దిగింది. దర్యాప్తును వేగవంతం చేసింది. బృందాలుగా విడిపోయి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అల్లర్లు జరిగిన నరసరావుపేటకు ఒక సిట్ బృందం, చంద్రగిరి మండలం కూచువారి పల్లికి మరో సిట్ టీం వెళ్లాయి. కూచువారిపల్లి సర్పంచ్ ఇంటిని సిట్ అధికారులు పరిశీలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ వెళ్లింది. ఏపీలో ఎన్నికల తర్వాత ఘర్షణలపై సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. ఘర్షణలపై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ప్రాథమిక సమాచారాన్ని సిట్ అధికారులు తీసుకున్నారు.
ఇవీ చదవండి: Warning: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిఘా విభాగం హెచ్చరికలు
Botcha: మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే : మంత్రి బొత్స
Report: ఏపీలో ఎన్నికల తర్వాత హింస పై సీఈసీకి నివేదిక
SIT: హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం
[…] […]