HomeరాజకీయాలుChandrababu: దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం: చంద్రబాబు

Chandrababu: దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం: చంద్రబాబు

Chandrababu: రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరిందన్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి టీడీపీ కి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దాడి చేశారని వాపోయారు.

మహిళలపై కూడా పాశవిక దాడికి దిగారని, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయన్నారు. పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. పోలీసులు, తనిఖీలు నిర్వహించి వైసీపీ మూకలను అరెస్ట్ చేయాలన్నారు. వైసీపీ మూకల ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేస్తే తప్ప దాడులు ఆగే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యానించారు. నిందితులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన పోలీసు అధికారులపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ
ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ నిలిపివేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. అప్ గ్రేడ్ పేరుతో ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ – ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల వరకు ఈ – ఆఫీస్ అప్ గ్రేడ్ అవసరం లేదన్నారు. కార్యాలయాల్లో ఫైల్స్, నోట్ ఫైల్స్, రికార్డులను భద్రపరచాలన్నారు. అన్ని HOD కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బాబు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: Andhra Pradesh: 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలి: సీఈసీ
CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ నజర్.. కీలక సమీక్ష
Central Election Commission: ఏపీ ఎన్నికల్లో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు
GV Prakash Kumar: విడాకులపై ట్రోలింగ్.. జీవీ ప్రకాష్‌ రియాక్షన్‌ ఇదీ..!
Kangana Ranaut: ఎమర్జెన్సీ మరోసారి వాయిదా.. కంగన మూవీకి రాజకీయ ఆలస్యం!

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News