Kejriwal: 75 సంవత్సరాలకు ప్రధాని మోదీ రిటైర్ అవుతారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈసారి బీజేపీ గెలిస్తే రెండు నెలల్లో యోగిని సీఎంగా తొలగిస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్. బీజేపీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు పోతాయని ఆరోపించారు. అమిత్ షాని ప్రధానిని చేయడం కోసమే ఓట్లు అడుగుతున్నారంటూ కేజ్రీవాల్ హాట్ కామెంట్స్ చేశారు. లక్నోలో ఆయన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
యూపీ ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాన్నారు. అమిత్ షాను ప్రధానిగా చేసేందుకే మోదీ ఓట్లడుగుతున్నారని కామెంట్ చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 నాటికి ఆయనకు 75 ఏళ్లు నిండుతాయన్నారు. మళ్లీ గెలిస్తే తన వారసుడిగా అమిత్ షాను మోదీ కూర్చోబెడతారంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఈ నిబంధన పెట్టిందే ఆయన అని, అందుకే ఇలా చేస్తున్నారన్నారు. దీని గురించి ఎక్కడా మోదీ మాట్లాడడం లేదన్నారు. ఒకవేళ మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రెండు మూడు నెలల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ఆ పదవి నుంచి తప్పిస్తారంటూ కామెంట్ చేశారు.
బీజేపీ భావిస్తున్నట్లుగా ఆ పార్టీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. జూన్ 4న అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి అని చెప్పారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం బీజేపీకి 220 సీట్లు రావన్నారు. హరియాణా, దిల్లీ, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, యూపీ, బిహార్, ఝార్ఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గిపోతాయన్నారు.
ఇవీ చదవండి: YSRCP: జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు: మంత్రి బొత్స
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ లేఖ
Chandrababu: దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం: చంద్రబాబు
CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ నజర్.. కీలక సమీక్ష
[…] […]