HomeరాజకీయాలుPM Modi: సాధువులపై అందుకే దాడులు చేస్తున్నారు: బెంగాల్‌లో మోదీ ఆగ్రహం

PM Modi: సాధువులపై అందుకే దాడులు చేస్తున్నారు: బెంగాల్‌లో మోదీ ఆగ్రహం

PM Modi: బెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కారుపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ అరాచక శక్తులు సాధువులపై దాడులు చేస్తున్నారని మోదీ విమర్శించారు. ఇవాళ ఆయన పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలి వచ్చారు.

సభలో మోదీ మాట్లాడుతూ.. టీఎంసీ గూండాలు రామకృష్ణ మిషన్‌పై దాడి చేశారని మండిపడ్డారు. ఇది చేసింది తామేనని టీఎంసీ ప్రకటించడం సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించారు. రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ మఠాల సాధువులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెదిరిస్తున్నారని, ఆదివారం రాత్రి జల్పాయ్‌గురిలోని రామకృష్ణ మిషన్‌పై దాడికి తెగబడ్డారని మోదీ ధ్వజమెత్తారు.

ఈ తరహా చర్యలను బెంగాల్‌ ప్రజలు సహించరని, సీఎంకు తగిన బుద్ధి చెబుతారంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఇస్కాన్‌, రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ్‌ సంస్థలు సేవ, విలువలకు నిదర్శనమని మోదీ అన్నారు. అయితే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బహిరంగంగా సాధువులను బెదిరిస్తున్నారంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ.. రామకృష్ణ మిషన్‌, భారత్‌ సేవాశ్రమ్‌ సంస్థలకు చెందిన సాధువులు బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని విమర్శించారు. మమత వ్యాఖ్యలను ఈ రెండు సంస్థల సాధువులు తీవ్రంగా ఖండించారు.

Read Also: PM Modi: సీఏఏపై ప్రతిపక్షాలది దుష్ప్రచారం: ప్రధాని మోదీ మండిపాటు
KTR: రెండు లక్షల ఉద్యోగాలేవీ? కాంగ్రెస్‌ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్‌
Allu Arjun: ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అలా స్పందించాడా?
CM Kejriwal: మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు
DBT: ఏపీలో పథకాల లబ్ధిదారులకు డీబీటీ నిధులు జమ

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News