PM Modi: సీఏఏ చట్టం అమలుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఈ చట్టం అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తున్నాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మోదీ.
భారత్‌కు వచ్చిన శరణార్థులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని మోదీ అన్నారు. దేశ విభజన, ఇతర కారణాలతో దేశంలో చాలా ఏళ్లుగా శరణార్థులు ఇక్కడ బతుకుతున్నారన్నారు. ఆ బాధితులకు కేంద్రం సీఏఏ ద్వారా పౌరస్వతం ఇస్తోందన్నారు. కానీ, ఎస్పీ, హస్తం పార్టీ ఈ చట్టంపై అసత్యాలు వల్లె వేస్తున్నామని ధ్వజమెత్తారు.
ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తన్నాయని విమర్శించారు. యూపీలోని అజంగఢ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారం సాధిస్తే సీఏఏను రద్దు చేసేందుకు ఇండియా కూటమి ఆలోచన చేస్తోందని మోదీ అన్నారు. అయితే అది ఎన్నటికీ జరగదని, పగటి కలలు మానుకోవాలన్నారు. ఈ చట్టాన్ని తొలగించడం సాధ్యం కాదన్నారు. ప్రతిపక్ష నేతలంతా మోసగాళ్లంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. మతోన్మాద మంటల్లో దేశం కాలిపోయేలా చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై ప్రధాని పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు.
సీఏఏ చట్టం ప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద సరైన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా మోదీ సర్కార్ నిబంధనల్ని రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఈ చట్టం వర్తిస్తుంది.
ఇవీ చదవండి: Kejriwal: 75 ఏళ్లకు ప్రధాని మోదీ రిటైర్ అవుతారు : కేజ్రీవాల్
YS Jagan: ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్
YSRCP: జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు: మంత్రి బొత్స
Chandrababu: దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం: చంద్రబాబు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ లేఖ
[…] […]
[…] […]
[…] […]