Andhra Pradesh: ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ రిపోర్టు అందించింది. ఇందులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 1370 మందిని నిందితులుగా గుర్తించారు. అల్లర్ల లో మొత్తం 33 కేసులు నమోదు అయ్యాయి. పల్నాడు 22, తిరుపతి 4, అనంతపురంలో 7 కేసులు నమోదు అయ్యాయి. మూడు జిల్లాల్లో కలిపి పరారీలో 1,152 మంది నిందితులు ఉన్నారు.
పల్నాడు జిల్లాలో 471 మంది పరారీలో ఉన్నారు. తిరుపతిలో 47 మంది నిందితులు పరారీలో ఉన్నారు. మరోవైపు తాడిపత్రిలో 636 మంది పరారీలో ఉన్నట్లు సిట్ రిపోర్టులో ఉంది. తాడిపత్రిలో 728 మంది అల్లర్ల లో పాల్గొన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 124 మంది అరెస్ట్ అయ్యారు. దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించామని సిట్ పేర్కొంది.
రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారని సిట్ పేర్కొంది. అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నామని, మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడి జరిగిందని సిట్ పేర్కొంది. ఇప్పటికే నమోదైన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించడానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటింగ్ లోపు మరో రిపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇకపై అల్లర్ల కు సంబంధించి నమోదైన కేసులను సిట్ పర్యవేక్షించనుంది.
150 పేజీలతో సిట్ నివేదికను డీజీపీ కి ఇచ్చాం : సిట్ చీఫ్ వినీత్ బ్రీజ్ లాల్
మొత్తం 33 కేసుల్లో వివరాలను పరిశీలించామని సిట్ పేర్కొంది. లోపాలు సవరించి దర్యాప్తు అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చామంది. జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల అరెస్ట్ కు ఆదేశించామంది. సరైన సెక్షన్ల తో కోర్టులో మెమో వేసి ప్రస్తుతం ఉన్న సెక్షన్ల కు అదనంగా కలపాలని ఆదేశించామంది. సీసీటీవీ ఫుటేజీ, వీడియోలు సేకరించాలని ఆదేశించామంది.
సాధ్యమైనంత త్వరగా ఛార్జ్ షీట్ వేయాలని చెప్పామని సిట్ పేర్కొంది. సిట్ పర్యటనలో పలువురు బాధితులు వచ్చి విజ్ఞాపనలు ఇచ్చారని పేర్కొంది. వాటిని కూడా పరిశీలనకు పంపామంది. క్షేత్రస్థాయిలో బృందాలు పర్యటించి సమాచారం సేకరించామంది. సాక్షుల స్టేట్ మెంట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించామని పేర్కొంది. అరెస్ట్ అయిన నిందితులు నిజమైన వారా ? లేదా కాదా ? అనేది పరిశీలించామని సిట్ పేర్కొంది.
ఇవీ చదవండి: Palnadu: పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు
Andhra Pradesh: 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలి: సీఈసీ
Special Investigation Team: డీఎస్పీల నేతృత్వంలో రంగంలోకి దిగిన సిట్
Central Election Commission: ఏపీ ఎన్నికల్లో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు