Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియనుండటంతో ఎల్లుండి జూన్ 2వ తేదీన తీహార్ జైలులో లొంగిపోనున్నారు. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తీహార్ జైలుకు కేజ్రీవాల్ వెళ్లనున్నారు. తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈసారి తనను ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారో తెలియదని వాపోయారు. జైల్లో తనను భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారని ఆరోపించారు. జైలులో తనకు మందులు, ఇన్సులిన్ ఇవ్వలేదన్నారు. తాను జైల్లో ఉన్నా ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
ఢిల్లీలో తాగునీటి సమస్యపై ఆప్ సర్కార్ న్యాయ పోరాటం
ఢిల్లీలో నీటి కొరత పై సుప్రీం కోర్టును ఆప్ ప్రభుత్వం ఆశ్రయించింది. హక్కుగా రావాల్సిన నీళ్లను ఇవ్వడం లేదంటూ సుప్రీం మెట్లెక్కింది ఆప్ ప్రభుత్వం. హర్యానా, యూపీ, హిమాచల్ నుంచి నీటిని విడుదల చేయడం లేదంటూ ఆప్ ఆరోపిస్తోంది. ఢిల్లీలో బిందెడు నీళ్ల కోసం జనం కొట్టుకుచస్తున్నారని తెలిపింది.
చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై పానీ పట్టు యుద్ధం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆప్. ఒక్క వాటర్ ట్యాంకర్ వస్తే నిమిషాల్లో ఖాళీ అవుతోందంది. స్లమ్ ఏరియాలో పరిస్థితి మరీ దయనీయంగా ఉందని చెబుతోంది. నీటిని వృధా చేస్తే రూ. 2 వేలు ఫైన్ వేస్తామని ఆప్ హెచ్చరిక జారీ చేసింది. నీటి వృధాని అరికట్టేందుకు 200 బృందాలు రంగంలోకి దిగాయి.
ఇవీ చదవండి: AAP: బీజేపీ, ఆప్ పార్టీల మధ్య మాటల మంటలు
KTR: రెండు లక్షల ఉద్యోగాలేవీ? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
CM Kejriwal: మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు
Kejriwal: 75 ఏళ్లకు ప్రధాని మోదీ రిటైర్ అవుతారు : కేజ్రీవాల్