YSRCP: ఈ ఎన్నికల్లో గెలుపుపై దీమాగా ఉంది వైఎస్సార్‌సీపీ. జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారంటూ ఆ పార్టీ నేతలు అప్పుడే ప్రకటనలు కూడా చేయడం గమనార్హం. ఇవాళ మీడియాతో మాట్లాడిన పలువురు వైఎస్సార్ సీపీ నేతలు.. కీలక వ్యాఖ్యలు చేశారు.
జూన్ 9న విశాఖలో సీఎం గా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. విశాఖలో అంగరంగ వైభవంగా జగన్ ప్రమాణస్వీకారం జరగబోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం జగన్ చేసేదే చెప్తారు.. మంచి జరిగే నిర్ణయాలనే తీసుకుంటారని స్పష్టం చేశారు. ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే ఉండాలని కోరుకున్నారని బొత్స అన్నారు.
టీడీపీ అసహనంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని బొత్స మండిపడ్డారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయండని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్ అన్నారు. గతంలో చంద్రబాబు హామీలు ఇచ్చి మాట తప్పారని గుర్తు చేశారు. బాబుకు అధికారం ఇస్తే మళ్లీ కష్టాలు వస్తాయని స్పష్టం చేశారు. మళ్లీ పెత్తందారులు వస్తారని ప్రజలు భయపడ్డారన్నారు.
చంద్రబాబుది మేకపోతు గాంభీర్యం అని మంత్రి బొత్స అన్నారు. అన్ని వర్గాల వారిని సమానంగా చూసిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. టీడీపీ అసహనంతో దాడులు చేసింది, మేం సంయమనం పాటించామని బొత్స తెలిపారు. వైఎసార్‌సీపీ వైనాట్ 175 కి దగ్గరగా సీట్లు గెలవబోతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు చెప్పుకోవడానికి ఏమీ లేదు.. అన్ని అబద్దాలు, తప్పుడు ప్రచారాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు.
మంత్రి బొత్స ఆధ్వర్యంలో గవర్నర్ ను కలిసిన వైసీపీ నేతల బృందం
ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసపై వైసీపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పై గవర్నర్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పల్నాడు, అనంతపురం జిల్లాల్లో పోలీసు అధికారులపై వైసీపీ కంప్లైంట్ చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. ఎవరూ దొరకనట్టు రిటైర్డ్ అధికారిని ఎన్నికల అబ్జర్వర్ గా తీసుకున్నారని ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. వచ్చే నెల 4 తర్వాత మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. పక్షపాత ధోరణితో వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు పేర్ని నాని.
ఇవీ చదవండి: Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ లేఖ
Chandrababu: దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం: చంద్రబాబు
Andhra Pradesh: 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలి: సీఈసీ
Andhra Pradesh: 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలి: సీఈసీ
CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ నజర్.. కీలక సమీక్ష
[…] చదవండి: YSRCP: జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస… Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు […]
[…] కూడా చదవండి: YSRCP: జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస… Kangana Ranaut: ఎమర్జెన్సీ మరోసారి వాయిదా.. […]
[…] Also: YSRCP: జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస… Palnadu: పల్నాడు జిల్లాలో హింసాత్మక […]