Ebrahim Raisi: హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) దుర్మరణం చెందారు. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా దేశాధ్యక్షులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త తనను తీవ్ర కలచివేసిందని మోదీ అన్నారు.
భారత్-ఇరాన్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని మోదీ తెలియజేశారు. ఈ విచారకర సమయంలో ఇరాన్ ప్రజలకు తోడుగా ఉంటామంటూ మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రైసీ మరణవార్త షాక్‌కు గురిచేసిందని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రితో పలుమార్లు సమావేశమయ్యాననని గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో తమ భేటీ అత్యంత సుహృద్భావ వాతావరణంలో జరిగిందన్నారు. కానీ ఇప్పుడు ఈ విషాదం ఊహించలేదని, విషాద సమయాన ఇరాన్ ప్రజలకు వెన్నంటి ఉంటామని జైశంకర్ అన్నారు.
రైసీ మరణంపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. ఇరాన్‌కు కలిగిన తీరని నష్టంపై పాకిస్థాన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. రైసీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. దాదాపు నెల రోజుల కిందట రైసీ, విదేశాంగ మంత్రికి పాక్ ఆతిథ్యం ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు.
Read Also: PM Modi: సాధువులపై అందుకే దాడులు చేస్తున్నారు: బెంగాల్‌లో మోదీ ఆగ్రహం
PM Modi: సీఏఏపై ప్రతిపక్షాలది దుష్ప్రచారం: ప్రధాని మోదీ మండిపాటు
KTR: రెండు లక్షల ఉద్యోగాలేవీ? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
CM Kejriwal: మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు
Kejriwal: 75 ఏళ్లకు ప్రధాని మోదీ రిటైర్ అవుతారు : కేజ్రీవాల్