Money: ఏపీలో జరిగిన ఎన్నికల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. రూ.107.96 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. 7,305 మందిని అరెస్ట్ చేశారు. రూ.58.70 కోట్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి 61,543 మంది అరెస్ట్ అయ్యారు. రూ.35.61 కోట్ల డ్రగ్స్ సీజ్ చేయగా, 1,730 మందిని అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 3,466 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
2019 ఏపీ ఎన్నికలతో పోల్చితే..
ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పాండిచ్చేరి నుంచి ఏపీకి తెస్తుండగా నగదు, డ్రగ్స్ భారీగా పట్టుకున్నారు ఏపీ పోలీసులు. 150 బోర్డర్ చెక్ పోస్ట్ ల ద్వారా పోలీస్, సెబ్, వాణిజ్య పన్నులశాఖ, రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో పోలీసులు దాడులు చేశారు. 35 మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 15 తాత్కాలిక చెక్ పోస్టులలో నిఘా ద్వారా వీటిని పట్టుకున్నట్టు ఏపీ పోలీసు శాఖ తెలిపింది.
2019 ఎన్నికల్లో రూ.41.80 కోట్లు స్వాధీనం చేసుకోగా, 2024 ఎన్నికల్లో రూ.107.96 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2019 ఎన్నికల్లో 7,305 మంది అరెస్ట్ అయ్యారు. అలాగే 2019 ఎన్నికల్లో 8.97 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశారు. అయితే, 2024లో 58.70 కోట్ల విలువైన మద్యం సీజ్ చేయగా, 61,543 మంది అరెస్ట్ అయ్యారు. 2019లో 5.04 కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్ చేస్తే.. 2024లో 35.61 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈసీ ఫోకస్
ఓట్ల లెక్కింపుపై ఢిల్లీ నుంచి సీఈసీ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. కచ్చితమైన ఫలితాల ప్రకటన, శాంతిభద్రతల పరిరక్షణకు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీగా పోలీసుల బందో బస్తు నిర్వహించనున్నారు. భద్రతా వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఎలాంటి హింసాత్మక ఘటనలూ జరగకుండా సీఈసీ చర్యలు తీసుకుంటోంది. పల్నాడు, సీమ జిల్లాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు
పిఠాపురంలో పవన్ మెజారిటీపై ఎక్కువగా పందాలు జరుగుతున్నాయి. చంద్రబాబు, జగన్ మెజార్టీల పైనా పెద్దఎత్తున బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఏపార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపైనా పందాలు నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లక్షకు ఐదు లక్షల చొప్పున బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.
చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ సస్పెన్షన్
విధుల్లో నిర్లక్ష్యం వహించారని చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేశారు డీజీపీ. నిన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఎస్పీ పర్యటించారు. సమస్యాత్మక గ్రామాలను పరిశీలించారు. ఎస్పీ పర్యటన తర్వాత చంద్రగిరి డీఎస్పీపై వేటు పడింది.
Read Also: Elections: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
Central Election Commission: ఏపీ ఎన్నికల్లో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు
Telangana Formation day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా దూరం
Andhra Pradesh: ఏపీ అల్లర్లపై సిట్ నివేదికలో కీలక అంశాలు
PM Modi: సాధువులపై అందుకే దాడులు చేస్తున్నారు: బెంగాల్‌లో మోదీ ఆగ్రహం