DBT: ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున లబ్ధిదారులకు డీబీటీ నగదు బదిలీ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రక్రియ పునరుద్ధరించారు. ఏపీలో ఎన్నికలు జరిగేముందు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాకుండా ఈసీ ఆదేశాలిచ్చింది. డీబీటీని ఈసీ ఆపేసింది. ఎన్నికల పోలింగ్ అయ్యాక డీబీటీ నిధులు ఇప్పుడు జగన్ ప్రభుత్వం జమ చేస్తోంది. 4 రోజుల్లో రూ. 5,868 కోట్ల నిధులు జమ చేసింది.
చేయూత మినహా అన్ని డీబీటీ స్కీంల లబ్ధిదారుల ఖాతాలకు చెల్లింపులు పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. చేయూత పథకం కింద ఇంకా రూ. 3,512 కోట్ల మేర పెండింగ్ ఉన్నాయి. ఈనెల 14 నుంచి ఇప్పటి వరకు రూ. 7,546.34 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి.
వైయస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ. 1843 కోట్లు జమ అయ్యాయి. రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ కింద అన్నదాతల ఖాతాల్లో రూ. 1,236 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేసింది. వైయస్సార్ చేయూత పథకం కింద రూ.1,552 కోట్లు జమ అయ్యాయి. ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ. 629 కోట్లను ప్రభుత్వం డీబీటీగా అందించింది.
జగనన్న విద్యాదీవెన ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా రూ.605 కోట్లను ప్రభుత్వం డీబీటీ కింద జమ చేసింది. ఈసీ అడ్డుకోవడంతో ఇన్నాళ్లు నిధులు లబ్ధిదారులకు అందలేదు. ఇప్పుడు జగన్ బటన్ నొక్కిన మొత్తాలు డీబీటీగా లబ్ధిదారులకు వరుసగా ప్రభుత్వం జమ చేస్తోంది.
ఇవీ చదవండి: Fear song from Devara: దేవర నుంచి సాంగ్ వచ్చేసింది.. అనిరుధ్ అరిపించేశాడుగా..!
CM Kejriwal: మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి పోలీసులు
Polling: ఐదో దశ పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లు
Special Investigation Team: డీఎస్పీల నేతృత్వంలో రంగంలోకి దిగిన సిట్