Counting: రేపు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దేశ వ్యాప్తంగా మరోసారి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమంటూ అనేక సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తేల్చిన తరుణంలో.. రేపు మధ్యాహ్నానికల్లా ఫలితం తేలిపోనుంది.
7 విడతల్లో సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రేపు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు చేపట్టారు పోలీసులు.
ఉత్కంఠకు రేపే తెర
ఏపీలో ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కు ఈసీ ఏర్పాట్లు పూర్తి ఇప్పటికే పూర్తి చేసింది. రేపు ఉ.8 గంటలకు లెక్కింపు ప్రారంభం అవుతుంది. తొలుత సర్వీస్, పోస్టల్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అనంతరం ఈవీఎంల ఓట్లు కౌంటింగ్ మొదలు పెడతారు. ఓట్ల లెక్కింపులో 25 వేల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. 200 మంది కేంద్ర పరిశీలకులను ఈసీ ఇప్పటికే నియమించింది.
నరసాపురం లేదా కొవ్వూరులో ఫస్ట్ రిజల్ట్స్ వెలువడే ఆస్కారం ఉంది. రంపచోడవరం, చంద్రగిరిలో చివరి ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. 111 నియోజకవర్గాల్లో 20 కంటే తక్కువ రౌండ్లలో లెక్కింపు కొనసాగనుంది. 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు ఉంటాయి. కుప్పం, పిఠాపురంలో 18 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ ఉండనుంది. మంగళగిరిలో 21 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుంది.
ఇవీ చదవండి: Elections: రేపటితో ముగియనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్
Telangana: తుది దశకు తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన
Balakrishna: బాలకృష్ణ అంజలిని తోసేయడంపై హీరో, నిర్మాత క్లారిటీ
Money: ఏపీలో ఎన్నికల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం సీజ్