CM Revanth Reddy: రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఆదాయం పెంపు మార్గాలను అన్వేషించాలన్నారు. పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకువెళ్లాలన్నారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా వ్యవహరించాలని సీఎం రేవంత్ సూచించారు. గతేడాది ఆదాయం ఆశాజనకంగా లేదని సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతినెలా టార్గెట్ నిర్దేశించుకుని రాబడి సాధించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాణిజ్య శాఖలో జరిగిన పొరపాట్లు పునరావృతం కావొద్దంటూ హెచ్చరికలు చేశారు.
రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను కంపల్సరీగా పాటించాలన్నారు. ఇతర రాష్ట్రాల స్టాంప్ డ్యూటీపై అధ్యయనం చేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉద్యోగుల కొరత ఉండొద్దని, వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టాలన్నారు. అధునాతన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు నిర్మించాలన్నారు. సామాన్యులకు ఇసుక కొరత రాకుండా చూడాలని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలంటూ సీఎం రేవంత్ సూచించారు.
ఇవీ చదవండి: Central Election Commission: ఏపీ ఎన్నికల్లో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు
GV Prakash Kumar: విడాకులపై ట్రోలింగ్.. జీవీ ప్రకాష్ రియాక్షన్ ఇదీ..!
Salaar2: సలార్ 2 నుంచి క్రేజీ అప్‌డేట్.. పవర్‌ఫుల్ విలన్‌గా మలయాళ నటుడు!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేయలేకపోయిన హిట్ సినిమాలు ఇవేనట!
[…] చదవండి: CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ నజర్… Central Election Commission: ఏపీ ఎన్నికల్లో హింసపై […]
[…] చదవండి: CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ నజర్… KTR: రెండు లక్షల ఉద్యోగాలేవీ? […]
[…] Also: CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ నజర్… TG Cabinet: మద్దతు ధరకే ధాన్యం సేకరణ.. TG […]