HomeరాజకీయాలుYS Jagan: ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్

YS Jagan: ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్

YS Jagan: జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందని సీఎం జగన్ అన్నారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు. ఎన్నికల ఫలితాలపై తొలిసా స్పందించారు సీఎం జగన్. ఇవాళ విజయవాడలోని ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్.. అక్కడి సిబ్బందిని అభినందించారు.

ప్రశాంత్ కిషోర్ ఊహించనన్ని సీట్లు రాబోతున్నాయని కామెంట్ చేశారు సీఎం జగన్. మళ్లీ అధికారంలోకి రాబోతున్నామన్నారు. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏం లేదని, వర్క్ అంతా టీమే చేస్తుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం జగన్ అన్నారు. 2019 లో 151 అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాలు గెలిచామని, ఈసారి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ స్థానాల కంటే ఎక్కువ గెలుస్తాం అని దీమా వ్యక్తం చేశారు. జూన్ 4న రానున్న ఎన్నికల ఫలితాల్లో ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని సీఎం జగన్‌ చెప్పారు.

ప్రశాంత్ కిషోర్ కు సీఎం జగన్ కౌంటర్
ప్రశాంత్ కిషోర్ మనకు వ్యతిరేకంగా మారారని సీఎం జగన్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించని ఫలితాలు వస్తాయని చెప్పారు. గతంలో కూడా 151 సీట్లు వస్తాయని ఊహించలేదని, కానీ ఈసారి మాత్రం వచ్చే ఫలితాలతో దేశం షాక్ అవుతుందన్నారు. గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాలన అందించామన్నారు.

ఇవీ చదవండి: YSRCP: జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు: మంత్రి బొత్స
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ లేఖ
Chandrababu: దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం: చంద్రబాబు
Andhra Pradesh: 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలి: సీఈసీ
CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ నజర్.. కీలక సమీక్ష

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News