Chandrababu: ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈనెల 12వ తేదీన నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాబినెట్ కూర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే చర్చ నడుస్తోంది. లోకేష్ మంత్రివర్గంలో చేరతారా? లేదా అని చర్చ జరుగుతోంది.
ఇక క్లీన్ ఇమేజ్ ఉన్నవారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంత్రి వర్గంలో చేరడం పై స్పష్టత ఇంకా రాలేదు. మంత్రివర్గంలో చేరితే స్థాయికి తగ్గట్లుగా కీలక శాఖలు తీసుకునే ఛాన్స్ ఉంది. బీజేపీ నుంచి ఎవరిని తీసుకుంటారోనని చర్చ జరుగుతోంది.
టీడీపీ కూటమికి ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు అభినందనలు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమికి ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అభినంనదలు తెలిపింది. కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వం వెంటనే రాష్ట్ర పాలనను గాడిలో పెట్టాలని హైకోర్టు ఉద్యోగుల సంఘం కోరింది. ఉద్యోగుల బకాయిలు సత్వరమే విడుదల చేయాలని సంఘం కోరింది. ఉద్యోగులకు నూతన పీఆర్సీని అమలు చేయాలన్నారు. ఈలోగా తగినంత ఐఆర్ ను వెంటనే ప్రకటించాలని కోరారు. నూతన ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండాలని ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు విన్నవించారు. ఉద్యోగుల వైద్య, ఆరోగ్య సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని అక్కెన వేణుగోపాలరావు అభిలషించారు.
Read also: Modi: ఈనెల 9న ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం
Tadepalli: తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్
Phone Tapping: ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ కలకలం
NTR: ప్రియమైన మావయ్యకు శుభాకాంక్షలు.. కూటమి గెలుపుపై జూనియర్ ఎన్టీఆర్