Andhra Pradesh: ఏపీలో ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. మూడు జిల్లాల డీఎస్పీలపై ఎన్నికల సంఘం వేటు వేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి డీఎస్పీలపై వేటు వేసింది. అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని సూచించింది. ప్రతి కేసుపై సిట్ ఏర్పాటు చేసి రెండ్రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశం ఇచ్చింది. ఎఫ్ ఐఆర్ లు పెట్టి ఐపీసీ, అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలని సూచించింది. రాష్ట్రంలో మరో 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
పోలింగ్ అనంతర హింసపై కఠినంగా వ్యవహరించాలని సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదేశాలు ఇచ్చింది. 25 కంపెనీల పారామిలటరీ బలగాలు రాష్ట్రంలో కొనసాగించాలని కేంద్ర హోంశాఖకు ఈసీ ఆదేశించింది.
ఇవీ చదవండి: CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ నజర్.. కీలక సమీక్ష
Central Election Commission: ఏపీ ఎన్నికల్లో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు
GV Prakash Kumar: విడాకులపై ట్రోలింగ్.. జీవీ ప్రకాష్ రియాక్షన్ ఇదీ..!
Kangana Ranaut: ఎమర్జెన్సీ మరోసారి వాయిదా.. కంగన మూవీకి రాజకీయ ఆలస్యం!
Janhvi Kapoor: ఎలాంటి వ్యక్తిని పెళ్లాడతానంటే.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు
[…] చదవండి: Andhra Pradesh: 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగి… CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ […]