Central Election Commission: ఏపీలో ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. పలువురు అధికారులపై సీఈసీ చర్యలు తీసుకుంది. పల్నాడు కలెక్టర్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. పల్నాడు కలెక్టర్ పై శాఖాపరమైన విచారణకు సీఈసీ ఆదేశాలు ఇచ్చింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసిన సీఈసీ.. తిరుపతి ఎస్పీని సైతం బదిలీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను సీఈసీ నియమించింది. హింసాత్మక ఘటనలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.
తిరుపతి జిల్లాలో సస్పెండ్ అయిన వారు..
1. తిరుపతి SDP – ఎ సురేందర్ రెడ్డి
2. SB ఇన్స్పెక్టర్ కె. రాజశేఖర్
3. తిరుపతి స్పెషల్ బ్రాంచ్ DSP – ఎం భాస్కర్ రెడ్డి
4. అలిపిరి ఇన్స్పెక్టర్ – ఓ రామచంద్రారెడ్డి
పల్నాడు జిల్లాలో సస్పెండైన వారు..
1. గురజాల SDPO – ఎ. పల్లపురాజు
2. నరసరావుపేట SDPO – వీఎస్ఎన్ వర్మ
3,4. DSB సీఐలు కె. ప్రభాకర్ రావు, ఈ బాలనాగిరెడ్డి
5. కారంపూడి ఎస్ఐ – ఎం రామాంజనేయులు
6. నాగార్జున సాగర్ ఎస్ఐ – డీవీ కొండారెడ్డి
అనంతపురం జిల్లాలో సస్పెండైన ఇద్దరు అధికారులు
1. తాడిపత్రి SDP – గంగయ్య
2. తాడిపత్రి సీఐ – మురళీకృష్ణ
ఇవీ చదవండి: GV Prakash Kumar: విడాకులపై ట్రోలింగ్.. జీవీ ప్రకాష్ రియాక్షన్ ఇదీ..!
[…] […]
[…] […]