Amaravati: అమరావతిలోని చంద్రబాబు నివాసం వద్ద సందడి వాతావరణం ఏర్పడింది. చంద్రబాబును కలిసేందుకు టీడీపీ నేతలు, అధికారులు చేరుకుంటున్నారు. చంద్రబాబు నివాసానికి మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు వచ్చారు. చంద్రబాబు నివాసం దగ్గర అదనపు భద్రత ఏర్పాటు చేశారు. సందర్శకులు, టీడీపీ శ్రేణుల రాకతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాస ప్రాంతం సందడిగా మారింది.
మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఆంజనేయులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అపాయింట్‌మెంట్ లేదని చెప్పడంతో చేసేదేమీ లేక చంద్రబాబు నివాసం నుంచి పీఎస్ఆర్ ఆంజనేయులు వెనుదిరిగారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారుల్లో అంతర్మథనం మొదలైంది. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద భద్రత పర్యవేక్షణ చేస్తున్నారు.
మరోవైపు ఈనెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఈనెల 9కి బదులు 12కి బాబు ప్రమాణస్వీకారం తేదీ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఉద్ధండరాయనపాలెం సమీపంలో ప్రమాణస్వీకారం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
Read also: NTR: ప్రియమైన మావయ్యకు శుభాకాంక్షలు.. కూటమి గెలుపుపై జూనియర్ ఎన్టీఆర్
Kejriwal: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ నిరాకరణ
Counting: వైయస్సార్ జిల్లాలోని కౌంటింగ్ ఏర్పాట్లు ఇవీ..
Actor Hema: రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసుల అదుపులో నటి హేమ
AP Counting: కౌంటింగ్‌పై స్పెషల్ ఫోకస్, ఎన్ని టేబుళ్లు? ఎంత మంది సిబ్బంది?