Palnadu: పోలింగ్ అనంతరం పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ వర్గీయులపై పోలీసులు భారీగా కేసులు నమోదు చేశారు. గురజాల నియోజకవర్గంలో వంద కేసులు, ఎఫ్ఐఆర్ లో 192 మంది పేర్లు ఉన్నాయి. దాచేపల్లి మండలంలో 70, పిడుగురాళ్ల మండలంలో 62 మందిపై కేసులు నమోదు చేశారు.
పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 కింద కేసులు కట్టారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు పెట్టారు. 70 మంది నిందితులను గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు నమోదు చేసి, 99 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేట నియోజకవర్గంలో 20 కేసులు నమోదు చేసి, 60 మంది నిందితులను గుర్తించారు.
నరసరావుపేటలో జరిగిన దాడుల్లో 11 మందిపై ఐపీసీ 147, 148, 324 కింద కేసులు నమోదు చేశారు. దాడులు, ఘర్షణల వీడియోలు చూసి నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో మరికొందరి పేర్లు చేర్చే అవకాశం ఉంది. మాచర్ల నియోజకవర్గంలో సైతం పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు.
డీజీపీ కార్యాలయంలో సిట్ ఉన్నతాధికారులను కలిసిన టీడీపీ నేతలు
డీజీపీ కార్యాలయంలో సిట్ ఉన్నతాధికారులను టీడీపీ నేతలు కలిశారు. పోలింగ్ అనంతర దాడుల వివరాలను సిట్ అధికారులకు ఈ సందర్భంగా అందించారు. వైసీపీ నేతల దాడుల ఆధారాలను పెన్ డ్రైవ్ ద్వారా అందించారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకంగా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి, తాడిపత్రి, అనంతపురం, పల్నాడు ఘటనలపై ఫిర్యాదు చేసినట్లు టీడీపీ తెలిపింది. మొత్తం 30 ఘటనల వివరాలను అందించినట్లు తెలిపింది.
ఇవీ చదవండి: DGP: డీజీపీ గుప్తాతో సిట్ అధిపతి వినీత్ బ్రిజ్ లాల్ సమావేశం
Special Investigation Team: డీఎస్పీల నేతృత్వంలో రంగంలోకి దిగిన సిట్
Warning: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిఘా విభాగం హెచ్చరికలు
Botcha: మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే : మంత్రి బొత్స
Report: ఏపీలో ఎన్నికల తర్వాత హింస పై సీఈసీకి నివేదిక
[…] […]
[…] […]