AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం సందర్భంగా పేపర్ లెస్ గా నిర్వహించడం ఆకర్షణీయంగా మారింది. పేపర్ లెస్ విధానం మళ్ళీ ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల సమర్థత పెరిగుతుందని, సమాచారం వేగవంతంగా వెళ్తుందని పేర్కొంది.
వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ ల విషయంలో బీకాం అర్హత ఉన్న వారిని తీసుకోమన్న నేపథ్యంలో 269 పోస్టులు మంజూరు చేశామని మంత్రి పార్థసారథి తెలిపారు. సాగునీటి వ్యవస్థలో మూడు వారాలు లోపు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
రివర్స్ టెండర్ విధానం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. పాత పద్ధతిని అమలు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. సెంట్రల్ విజిలెన్స్ గైడ్ లెన్స్ ఆధారంగా టెండర్ విధానం అమలు చేస్తామన్నారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణం పూర్తికి నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఉత్తరాంధ్ర అవసరాల తీర్చేందుకు ఇది ఎంతో అవసరమన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయని, పంట పొలాలు నీట మునిగిపోతున్నాయన్నారు. అన్ని ప్రాజెక్టులను సమగ్రంగా పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారని, ఎక్సయిజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణకు ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఈబీ పూర్తిగా విఫలం చెందిందన్నారు.
రాష్ట్రంలో మద్యం విధానంలో గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రం రూ.18 వేల కోట్లు ఆదాయం కోల్పోయిందన్నారు. 2014-19 సమయంలో ఉన్న ఎక్సయిజ్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
అసైన్డ్ ల్యాండ్స్ రాష్ట్రంలో 36 లక్షలు ఉన్నాయన్నారు. 29 లక్షల ఎకరాల వివరాలు పరిశీలించామన్నారు. 16.6 లక్షల ఎకరాల అన్యాక్రాంతం అయ్యాయన్నారు. 25,232 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా జరిగాయన్నారు. ఈ భూములపై సమగ్ర విచారణ జరపాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు.
సెప్టెంబర్ ఆఖరుకు వీటిపై నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. 2774 రేషన్ దుకాణాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఇందుకోసం రూ.11.5 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఇసుక పాలసీ (ఉచిత ఇసుక) ద్వారా 47 లక్షల టన్నులు ప్రజలకు అందించామన్నారు. ప్రయివేటు పట్టా ల్యాండ్స్ లో ఇసుక ఉంటే అది కూడా తీసుకోవచ్చన్నారు. సదరు రైతుకు కూడా లబ్ది చేకూర్చేలా నిర్ణయం తీసుకుంటామన్నారు.
వికసిత ఆంధ్రా 2047 గురించి కేబినెట్ లో చర్చించామన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు విజన్ 2047 డెవలప్ చేస్తామన్నారు. ట్రిపుల్ ఐటీని పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్ గా గత ప్రభుత్వం వినియోగించిందన్నారు.
Read also: YSRCP: ఏపీలో వైసీపీకి వరుస షాకులు.. నేతల రాజీనామాల పర్వం
Rammohan Naidu: కొప్పర్తి, ఓర్వకల్లులో పారిశ్రామిక కారిడార్లు
Narayana: టీడీఆర్ బాండ్ల అక్రమాలు తేలుస్తాం: మంత్రి నారాయణ
Grama Sabhalu: గ్రామ సభల ప్రారంభంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు