Muddada Ravichandra: ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకులో ఆయన సీఎం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు దివ్య ఆశీస్సులు అందించారు. అనంతరం పలువురు అధికారులు, సిబ్బంది రవిచంద్రకు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
అంతకు ముందు టీఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న, గుంటురు జిల్లా కలక్టర్ యం.వేణు గోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ గూడి, న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్, ప్రోటోకాల్ డైరక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, సచివాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read also: Chandrababu: కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
Muddada Ravi chandra: సీఎం పేషీలోకి తొలి అధికారి.. చంద్రబాబు ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర
CM Chandrababu: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు
Chandrababu Oath: చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష