Nadendla Manohar: కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలబడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతన్నకు పెద్దపీట వేస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు వేస్తామని తెలిపారు.
గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టిందనీ, రైతాంగం పడిన కష్టాలు ప్రత్యక్షంగా చూశామని, అలాంటి కష్టాలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ధాన్యం అమ్మిన 48 గంటల్లోపు సొమ్ము ఖాతాల్లో పడే ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పంటల బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకి అండగా నిలిచేందుకు పౌరసరఫరాల శాఖ, కూటమి ప్రభుత్వం నిరంతరం పని చేస్తాయని హామీ ఇచ్చారు.
సోమవారం ఏలూరు జిల్లా కేంద్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతులకు గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను విడుదల చేశారు. గత ప్రభుత్వం రైతులకు రూ. 1674 కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిలు ఉంచింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు విడుదల చేయగా, మిగిలిన రూ. 674 కోట్లను ఏలూరులో శ్రీ మనోహర్ గారు సోమవారం ఉదయం విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతులకు రూ. 472 కోట్ల ఒకేసారి రైతుల ఖాతాల్లో వేసే ఏర్పాటు చేశారు.
మా మీద నమ్మకంతో ఓటు వేసి బాధ్యత అప్పగించిన ప్రజల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 150 కందిపప్పు సరఫరా చేస్తున్నామన్నారు. బియ్యం విషయంలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. పౌరసరఫరాల శాఖ రుణాలు రూ.40 వేల కోట్లలో వచ్చే మార్చి 31 నాటికి రూ. 10 వేల కోట్లు తిరగి బ్యాంకర్లకు చెల్లించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Read also: Chandrababu: కొత్త పారిశ్రామిక విధానంతో దేశం మనవైపు చూడాలి: సీఎం చంద్రబాబు
Chandrababu: కొత్త పారిశ్రామిక విధానంతో దేశం మనవైపు చూడాలి: సీఎం చంద్రబాబు
Cholesterol: మనిషికి కొలెస్ట్రాల్ అధికమైతే ఏమవుతుంది?
AI Women: ఈ అమ్మాయి చాలా హాట్ గురూ.. జరా శతావరిని చూశారా?
Mobile Theft: రైల్లో ప్రయాణిస్తూ సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా? అయితే ఇలా చేయండి