Voting: ఎన్నికల టైములో ఓటర్ల జాబితాలో పేరు కనపడకుండా పోవడం, మరికొందరు ఇతరుల పేరుతో దొంగ ఓట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. ఓటరు లిస్ట్‌లో పేరు లేకపోతే చాలా మంది నిరాశ చెందుతారు. ఇలా తమ ఓటును వేరొకొరు దొంగ ఓటు వేస్తే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అటువంటి సమయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు.
వేరే వాళ్లు మీ ఓటును వేసిన మీ ఓటును వినియోగించుకోవచ్చు. సెక్షన్ 49(పి) దీనికి ఒక పరిష్కారం ఉంది. భారత ఎన్నికల సంఘం (ఈసీ) 1961లో సెక్షన్ 49(పి)ను అమల్లోకి తెచ్చింది. 1961లో ఎన్నికల సంఘం ఓటరు ఓటు హక్కును కోల్పోకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఈ సెక్షన్ దోహదపడుతుంది.
ఎవరిని కలవాలంటే..
పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ అధికారిని కలుసుకోవాలి. అక్కడ ఆ అధికారి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డు, పోలింగ్ బూత్ స్లిప్‌లను రుజువుగా చూపించాల్సి ఉంటుంది. ఆ అధికారి మీ సమాధానాలతో సంతృప్తి చెందితే, మీరు ఓటు వేయడానికి అనుమతిస్తారు.
ఇలా చేయాలి
మీరు ఓటును ఈవీఎంల ద్వారా వేయలేరు. ఈ రకమైన ఓటును టెండర్ ఓటు అంటారు. దీని కోసం, ఓటర్లకు బ్యాలెట్ పేపర్ ఇవ్వబడుతుంది. బ్యాలెట్ పేపర్ పై మాత్రమే ఓటు వేసే అనుమతి ఇస్తారు. అయితే ఈ ఓట్లను లెక్కించరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే.. టెండర్ ఓట్ల సహాయంతో గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తారు. నిజానికి ఎన్నికల్లో 49(పి)ని వినియోగించుకున్న వారు చాలా తక్కువ. చాలా ప్రాంతాల్లో 49(పి) గురించి ఎక్కువగా తెలియకపోవడమే ఇందుకు కారణం. అందుకే ఎలక్షన్ అధికారులే చొరవ తీసుకుని అందరికి అవగాహన కల్పించాలి. ఇలా ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.
Read also: Fine: ఓటు వెయ్యకపోతే 50 డాలర్ల ఫైన్.. ఎక్కడో తెలుసా?
Kangana Ranaut: నాకు నటన రాదు.. నా సరసన నటించేందుకు కంగన ఒప్పుకోదు!
Microsoft: ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు
Vote: నోటాకు ఓటేశారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాకవుతారు