HomeసినిమాMahesh babu: నేనెంతో సంబరపడుతున్నా.. ఎంజాయ్ యువర్ లైఫ్: మహేష్ బాబు

Mahesh babu: నేనెంతో సంబరపడుతున్నా.. ఎంజాయ్ యువర్ లైఫ్: మహేష్ బాబు

Mahesh babu: అగ్ర కథా నాయకుడు మహేశ్‌బాబు (Mahesh babu), నమ్రత (Namrata Shirodkar) దంపతుల తనయుడు గౌతమ్‌ (Gautam) బర్త్ డే సందర్భంగా ఇవాళ మహేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కుమారుడికి శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాలో పోస్టులు పెట్టారు. గౌతమ్‌ విషయంలో తాను ఆనందపడుతున్నానని సూపర్ స్టార్ పేర్కొన్నారు. ‘‘హ్యాపీ 18 మై సన్‌. ఈ సమయంలో ఎన్నో విషయాలు అన్వేషించు. ఎంజాయ్‌ చెయ్‌. లవ్‌ యూ. ఒక తండ్రిగా ఈరోజు నేనెంతో ఆనందంగా ఉన్నా’’ అని పోస్టులో మహేశ్ పేర్కొన్నారు.

నమ్రత సైతం ఇన్‌స్టా వేదికగా తనయుడికి విషెస్‌ తెలియజేశారు. ‘‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌. నీ విషయంలో మేమెంతో ఆనందిస్తున్నాం. ఈ సమయం మనకు చాలా స్పెషల్. జీవితంలో నువ్వు ఇలాగే వెలగాలని కోరుకుంటున్నా. లవ్‌ యూ’’ అని నమ్రత పేర్కొన్నారు.

తల్లిదండ్రుల తరహాలో గౌతమ్‌ యాక్టింగ్‌లో మంచి మార్కులు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే నటనలో శిక్షణ కోసం న్యూయార్క్‌ యూనివర్సిటీకి వెళ్లాడు. దీనిపై మహేశ్‌ – నమ్రత కుమార్తె సితార ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా పలు విషయాలు పంచుకున్నారు.

‘‘అన్నయ్య ‘1 నేనొక్కడినే’తో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. అతడు హీరోగా వెండితెరపై కనిపించే క్షణం కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నా. దాదాపు నాలుగేళ్ల పాటు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుని వస్తాడు. అతను తప్పకుండా మంచి నటుడు అవుతాడన్న నమ్మకం ఏంది. నేనూ యాక్టింగ్‌ స్కూల్స్‌కు పోతున్నా’’ అని సితార తెలిపింది.

ఇవీ చదవండి: Mohanlal: మలయాళ సినిమా ఇండస్ట్రీని నాయశనం చేయొద్దు.. మోహన్ లాల్
Perni Nani: నమ్మినవారిని మోసం చేయడం బాబుకు అలవాటు: పేర్ని నాని
Nara Lokesh: ప్రఖ్యాత ఐటీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పిస్తాం: మంత్రి లోకేష్
Andhra Pradesh: రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మార్చుతాం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News