Mobile Theft: రైలులో ప్రయాణించేటప్పుడు మీ ఫోన్ పొరపాటున పోగొట్టుకున్నారా? లేదా అపహరణకు గురైందా? తిరిగి పొందడం కష్టంగా మారిందా? అయితే, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. రైలులో మీ పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి పొందేందుకు భారతీయ రైల్వే సంచార్ సతి పోర్టల్‌తో చేతులు కలిపింది. దీని సహాయంతో ప్రజలు ప్రయాణించేటప్పుడు పోగొట్టుకున్న ఫోన్‌లను తిరిగి పొందడం చాలా సులభం.
సంచార్ సతి పోర్టల్
టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ గత ఏడాది మేలో సంచార్ సతి పోర్టల్‌ను ప్రారంభించారు. సంచార్ సాథీ సహాయంతో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గరైనా, దాన్ని ఎలా బ్లాక్ చేయవచ్చు, ట్రాక్ చేయడం.. ట్రేస్ చేయడం వంటివి చేసువచ్చు. ఇది అతని డేటా, వ్యక్తిగత విషయాలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. సదరు వ్యక్తి సిమ్ కార్డుతో పాటు ఫోన్‌ను కూడా బ్లాక్ చేయవచ్చు. సంచార్ సతి పోర్టల్‌ను ఉపయోగించి ఇప్పటివరకు 40 లక్షలకు పైగా మోసపూరిత కనెక్షన్‌లను గుర్తించారు.
ఫిర్యాదు ఎలా చేయాలంటే..
ప్రజల ప్రయాణానికి, వారి భద్రతకు సాధికారత కల్పించేందుకు టెలీకమ్యూనికేషన్స్ విభాగం భారతీయ రైల్వేతో టై అప్ అయ్యిందని టెలికాం డిపార్ట్‌మెంట్ చెప్పింది. ఇందులో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీరు పోగొట్టుకున్న లేదా దొంగిలించిన ఫోన్‌ని ఇప్పుడు సంచార్ సతి పోర్టల్‌లో నివేదించవచ్చు.
మొబైల్ ఫోన్ పోయినా లేదా థెఫ్ట్ అయినా, బ్లాక్ చేయడం.. ట్రాక్ చేయడం.. ట్రేస్ చేయడం వంటివి చేయవచ్చు. ఇది దాని డేటాను, వ్యక్తిగత విషయాలను సురక్షితంగా ఉంచడంలో సాయ పడుతుంది.
ఇవీ చదవండి: Voting: మీ ఓటును ఎవరో వేసేశారా? ఏం చేయాలంటే..
Fine: ఓటు వెయ్యకపోతే 50 డాలర్ల ఫైన్.. ఎక్కడో తెలుసా?
Kangana Ranaut: నాకు నటన రాదు.. నా సరసన నటించేందుకు కంగన ఒప్పుకోదు!
Vote: నోటాకు ఓటేశారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాకవుతారు