HomeరాజకీయాలుKollu Ravindra: గనులు, ఎక్సైజ్ శాఖలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన

Kollu Ravindra: గనులు, ఎక్సైజ్ శాఖలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన

Kollu Ravindra: ఐదేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైన గనులు, ఎక్సైజ్ శాఖలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్బ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన ఖనిజ సంపద వనరులను ప్రజా శ్రేయస్సు కోసం సద్వినియోగం చేస్తామన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ మొదటి అంతస్తులో ఆయనకు కేటాయించిన ఛాంబరులో వేదపండితుల మంత్రోత్సారణల మధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 2022 వ సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న ఓఎన్జీసి పెట్రోలియం మైనింగ్ లీజు పునరుద్ధరణ ఫైల్ పై తొలి సంతకం చేశారు. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిబంధనలు 1959 ప్రకారం కొన్ని షరతులకు లోబడి 2040 సంవత్సరం వరకూ ఈ లైసెన్స్ పునరుద్ధరణ చేయడం జరుగుతుంది.

ఆయన మాట్లాడుతూ కూటమి ద్వారా రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ విధానాన్ని రూపకల్పన చేసి, మద్యం లావాదేవీలు, డిస్టిలరీల నుంచి మధ్యం పంపిణీ తదితర కార్యక్రమాలను అత్యంత పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. అక్రమ ఇసుక రవాణాను నియంత్రించి, ప్రజావసరాల కనుగుణంగా ఇసుకను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

అత్యంత కీలకమైన గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖలు తమకు కేటాయించడం ఒక గురుతర బాధ్యతగా భావిస్తూ, సమర్ధవంతంగా పని చేసి, వాటి ద్వారా రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం చేకూర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన తెలిపారు. తమకు ఇటు వంటి కీలకమైన శాఖలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి, మచిలీపట్నం నియోజకవర్గ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి: Pawan: 2047 విజన్ డాక్యుమెంటుకు అనుగుణంగా పని చేద్దాం: పవన్
Pawan Kalyan: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సమీక్షలతో బిజీ బిజీ…
Yoga: ఆరోగ్య భాగ్యానికి సులువైన మార్గం.. యోగా
Satya Kumar Yadav: డయేరియాపై మెరుగైన వైద్య సేవల్ని అందించాలి: మంత్రి సత్యకుమార్
CS Neerabh Kumar Prasad: వచ్చే నెల 1 నుంచి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News