Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. ఈనెల 27న తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేవర ట్రైలర్ రేపు (సెప్టెంబర్ 10న) విడుదల కానున్న నేపథ్యంలో అంతటా దేవర ట్రైలర్ హవా కొనసాగుతోంది. ఈ ఈవెంట్ ముంబైలో జరగనుంది. ఇందుకు జూనియర్ ఎన్టీఆర్ ముంబైకి చేరుకున్నాడు.
‘దేవర’ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. కరణ్ జోహార్‌కి చెందిన ఈ నిర్మాణ సంస్థ తొలుత ‘బాహుబలి’ మూవీని బాలీవుడ్ పబ్లిక్‌లోకి తీసుకుపోయింది. ఇప్పుడు ‘దేవర’ మూవీని నార్త్ బెల్ట్‌లో విడుదల చేసేందుకు భారీ ధరకు దక్కించుకోవడం విశేషం.
బాలీవుడ్‌లో దేవర వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. థియేటర్స్, ప్రమోషన్స్ అన్నీ ఈ సంస్థ పకడ్బందీగా ప్రణాళికలు వేసిందట. ఒక సినిమాను కరణ్ జోహార్ అండ్ టీమ్ ఎలా డీల్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు.
ఇవీ చదవండి: NTR: ప్రియమైన మావయ్యకు శుభాకాంక్షలు.. కూటమి గెలుపుపై జూనియర్ ఎన్టీఆర్
NTR: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం
NTR: హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్