Irrigation: ఆఖరి ఎకరం వరకూ నీరు అందించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడలోని జలసౌధలో ఇరిగేషన్ శాఖపై సమీక్షించారు. అధికారులు నిర్లక్ష్యం వదిలి పని చేయాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రకృతి కరుణించి ఈసారి కృష్ణానదికి సకాలంలో వరదలు రావడంతో నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు 15రోజుల ముందుగానే నీరందించామన్నారు. సాగర్ ఎడమ కాలువ కింద జోన్-3లో వెంటనే చెరువులు నింపి తాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు. గత ప్రభుత్వంలో సరైన నిర్వహణ లేకపోవడంతో కాలువలకు గండ్లు పడుతున్నాయని, ఈ సీజన్ లో ప్రతి అధికారి కాలువ గట్లపైనే ఉండి పని చేయాలని,నీరందలేదని రైతుల నుండి ఎటవంటి ఫిర్యాదు అందకూడదని సిఎం పదే పదే చెబుతున్నారని కాబట్టి అధికారులు ప్రతి నీటి బొట్టునూ వృధాగా పోనీయకుండా జాగ్రత్త చేసుకుంటూ పని చేయాలని సూచించారు.
చింతలపూడి ఎత్తిపోతల పధకంను పూర్తి చేయాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, గతంలో తమ హయాంలోనే మొత్తంగా రూ.2,195 కోట్లు కేటాయించి ప్రాజెక్టును కీలక దశకు తీసుకువచ్చిందన్నారు. జగన్ ప్రభుత్వం గత అయిదేళ్ళలో ఒక్కరూపాయి కూడా కేటాయించకపోవడంతో ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు.
వరదల సమయంలో 90 రోజుల పాటు, 53 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసేలా గతంలో తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించిందని, ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 4.80 లక్షల ఎకరాలకు సాగు నీరు, 26 లక్షల మందికి తాగు నీరందనుందన్నారు. మొత్తంగా రెండు జిల్లాల్లోని 33 మండలాల్లో 410 గ్రామాలు లబ్దిపొందనున్నాయని వివరించారు.
ఇవీ చదవండి: AP Cabinet: మళ్లీ పేపర్ లెస్ విధానం.. ఏపీ కేబినెట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
YSRCP: ఏపీలో వైసీపీకి వరుస షాకులు.. నేతల రాజీనామాల పర్వం
Rammohan Naidu: కొప్పర్తి, ఓర్వకల్లులో పారిశ్రామిక కారిడార్లు
Varudhu Kalyani: హోంమంత్రి అనితపై వరుదు కల్యాణి కీలక వ్యాఖ్యలు
Grama Sabhalu: గ్రామ సభల ప్రారంభంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు