Hardik Pandya: ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్య మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును వదలి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రావడం మొదలు.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై దారుణ వైఫల్యం వరకు హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంపై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తన జీవిత భాగస్వామి నటాషా స్టాంకోవిచ్ (Natasa Stankovic) నుంచి పాండ్యా విడిపోతున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మనస్పర్థలు ఎక్కువ కావడంతో వీరిద్దరూ విడాకులు (Divorce Rumours) తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.
తాజాగా నటాషా తన ఇన్‌స్టా గ్రామ్‌లో పాండ్యాతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను డిలీట్ చేసింది. కేవలం కుమారుడితో ఇద్దరూ ఉన్న చిత్రాలను మాత్రమే ఉంచింది. దాంతోపాటు ఇన్‌స్టా యూజర్‌నేమ్‌లోనూ తన భర్త పేరును, పాండ్యా అనే పదాన్ని తీసేసింది. దీంతో వీరిద్దరూ విడిపోవడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీరిద్దరూ ఈ మధ్య కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాండ్యా పోస్ట్ చేసిన ఫొటోనే ఆఖరిది.
ఐపీఎల్ టోర్నీ జరిగిన అన్ని మ్యాచుల్లోనూ నటాషా స్టాండ్స్‌లో కనిపించలేదు. ముంబై, పాండ్యాకు మద్దతుగా ఎలాంటి పోస్ట్‌లు పెట్టలేదు. మార్చి 4న నటాషా పుట్టినరోజు సందర్భంగా పాండ్యా సైతం విష్ చేయలేదు. ఇవన్నీ విడాకుల ప్రచారానికి బలం ఇస్తున్నాయని తెలుస్తోంది. అయితే, ఈ వదంతులపై పాండ్యా దంపతులు అధికారికంగా స్పందించలేదు.
2019 డిసెంబర్ 31న దుబైలో హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి నటాషా చేతికి ఉంగరం తొడిగి వినూత్నంగా తన లవ్‌ను తెలిపాడు. అప్పుడే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అనంతరం కుటుంబసభ్యుల సమక్షంలో ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2020లో లాక్‌డౌన్‌లో తన భార్య గర్భిణి అని సోషల్‌మీడియాలో పెట్టినప్పుడే అతడికి వివాహం అయిదని లోకానికి తెలిసింది. అదే ఏడాది జులైలో నటాషా మగపిల్లాడికి జన్మను ఇచ్చింది.
అప్పుడు కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన పాండ్యా, నటాషా.. గతేడాది మరోసారి వివాహం చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్ట్రియన్ సంప్రదాయాల్లో పరిణయమాడారు. ఇప్పుడు నాలుగైదేళ్లయినా సంసారం చేయకముందే విడిపోతారనే వార్తలు రావడం అభిమానులను కలవరపెడుతోంది.
Read Also: Manchu Manoj: ఓపిక విలువ ఏంటో ఇప్పుడే తెలిసింది: మంచు మనోజ్
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం
Vijay: విజయ్ ‘గోట్’కు ‘అవతార్’ ఎక్స్‌పర్టుల విజువల్స్!
GV Prakash Kumar: విడాకులపై ట్రోలింగ్.. జీవీ ప్రకాష్ రియాక్షన్ ఇదీ..!
Janhvi Kapoor: “మిస్టర్ అండ్ మిసెస్ మహి” ప్రమోషన్స్‌లో జాన్వీ బిజీ..