Rains: కేరళ పరిసరాల్లోని ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ కోరారు.
మరోవైపు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. గంటకు 17 కి.మీ వేగంతో కదులుతున్న తీవ్రవాయుగుండం.. మరికొద్ది గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తునానుకు రెమాల్ గా నామకరణం చేశారు. రేపు ఉదయం తీవ్ర తుఫాన్ గా రెమాల్ మారుతుందని తెలుస్తోంది. రేపు అర్థరాత్రి బెంగాల్ సమీపంలో తీరందాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 27 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి వీస్తున్న బలమైన ఈదురుగాలులు తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు తెలిపారు. కోస్తాలోని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడు, రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశాసినట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
ఇవీ చదవండి: TG Cabinet: మద్దతు ధరకే ధాన్యం సేకరణ.. TG కేబినెట్ కీలక నిర్ణయాలు
YSRCP: అధికారులను మార్చిన చోటే హింస జరిగింది: వైఎస్సార్‌సీపీ నేతలు
Bengaluru Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు నటులు, టెకీలు!
Hardik Pandya: షాకింగ్.. హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకుంటున్నారా?
[…] […]