Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కౌంటింగ్ సందర్భంగా జూన్ 4న, అంతకు ముందు, తర్వాత అల్లర్లు జరిగే సంకేతాలు ఉండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు ఏపీ పోలీసులు. మాచర్ల, తిరుపతి, అనంతపురం, పల్నాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెంచారు. ఏపీ వ్యాప్తంగా 469 సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. గత మూడు రోజులుగా 276 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడంతో చాలా వరకు ప్రాంతాల్లో అల్లర్ల ప్రభావం తగ్గింది. అనేక ప్రాంతాల్లో బాణాసంచా ర్యాలీలపై నిషేధం విధించారు.
తనిఖీలు ముమ్మరం
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి.
కౌంటింగ్ సందర్భంగా హై అలర్ట్..
ఏపీలోని అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు. అధికారులను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 56 మంది ప్రత్యేక పోలీస్ అధికారుల నియామకం జరిగింది. పల్నాడులో అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను నియమించారు.
Read Also: Telangana: 2024-25 తెలంగాణ విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల
Janhvi Kapoor: “మిస్టర్ అండ్ మిసెస్ మహి” ప్రమోషన్స్‌లో జాన్వీ బిజీ..
Hardik Pandya: షాకింగ్.. హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకుంటున్నారా?
Netflix: ‘లీవ్ ద వరల్డ్ బిహైండ్’ మూవీ రికార్డ్.. 121మిలియన్ల వ్యూస్‌తో నంబర్ 1
Manchu Lakshmi: రేవ్ పార్టీపై మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు