AP CS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన్ను సీఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీవోఆర్టీ నంబర్ 1034 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎస్ చాంబర్‌లో టీటీడీ వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల నడుమ ఆయన ఇవాళ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఆయన మాట్లాడుతూ ముందుగా సీఎస్ గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న ఎన్.చంద్రబాబు నాయుడుకు కృతజ్ణతలు తెలిపారు. సహచర కార్యదర్శులు, శాఖాధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు.
ఇవీ చదవండి: AB Venkateswara Rao: ఎట్టకేలకు ఏబీవీకి పోస్టింగ్, బాధ్యతలు, రిటైర్‌మెంట్!
Netflix: ‘లీవ్ ద వరల్డ్ బిహైండ్’ మూవీ రికార్డ్.. 121మిలియన్ల వ్యూస్‌తో నంబర్ 1
Chandrababu: ఈనెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం
Modi: ఈనెల 9న ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం
Phone Tapping: ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ కలకలం