NTR: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
మీ విజయం ఏపీ అభివృద్ధి పథంవైపు నడిపిస్తుందని ఆశిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేష్, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఎక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ పోస్టు చేశారు.
Read Also: NTR: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
NTR: మీ మద్దతుకు కృతజ్ఞతలు.. ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ స్పెషల్ థ్యాంక్స్!
NTR: ఏపీలో ఓ ఆలయానికి జూ.ఎన్టీఆర్ రూ.12.5 లక్షల విరాళం
NTR: హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
Central Election Commission: ఏపీ ఎన్నికల్లో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు