Telangana: 2024-25 తెలంగాణ విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదలైంది. తెలంగాణలో జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. 2025 ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. 2025 ఫిబ్రవరి 28లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేస్తారు. తెలంగాణలో 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు ఉంటాయి.
అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. ఉ.9:30 నుంచి సా.4:45 వరకు హైస్కూల్స్ టైమింగ్స్ ఉంటాయని క్యాలెండర్‌లో విద్యాశాఖ తెలిపింది. ఉ.9 నుంచి సా.4:15 వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటాయని క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
నిరుద్యోగుల కష్టాలు తీర్చింది బీఆర్ఎస్: కేటీఆర్
నిరుద్యోగుల కష్టాలు తీర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. తమ హయంలో 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రైవేట్ సెక్టార్ లో 24 లక్షల ఉద్యోగ కల్పన చేశామని పేర్కొన్నారు. దేశంలో ఏ ప్రభుత్వమైనా ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. నిరూపిస్తే 24 గంటల్లో పదవికి రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.
Read Also: Telangana Formation day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా దూరం
CM Revanth Reddy: ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ నజర్.. కీలక సమీక్ష
KCR: రైతు వ్యతిరేక కాంగ్రెస్ చర్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు: కేసీఆర్
KTR: రెండు లక్షల ఉద్యోగాలేవీ? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Rains: కేరళ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు