AP Counting: ఉత్కంఠకు తెర వీడనుంది. 21 రోజులుగా ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పును రేపు లెక్కగట్టనున్నారు అధికారులు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, ఉదయం 8.30 నుంచి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.33 కోట్ల ఓట్లు పోలయ్యాయి. ఫెసిలిటేషన్ సెంటర్లలో 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయి.
26,721 సర్వీస్ ఓట్లు వచ్చాయని ఈసీఐ తెలిపింది. భీమిలి, పాణ్యంలో గరిష్టంగా 26 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. కొవ్వూరు, నరసాపురంలో 13 రౌండ్లు మాత్రమే కౌంటింగ్ ఉంటుంది. ఐదు గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 సెంటర్లలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.
లోక్ సభ ఓట్ల లెక్కింపునకు 2,443 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటు చేశారు. లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 443 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను అధికారులు అరేంజ్ చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఉంటుంది. మూడంచెల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎంల వద్ద కేంద్ర పారా మిలటరీ బలగాల మోహరింపు జరిగింది.
రెండో దశలో కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఉంటారు. కౌంటింగ్ కేంద్రం బయట లా అండ్ ఆర్డర్ పోలీసులు పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర భద్రతా బలగాల మోహరింపు చేశారు. తుది ఫలితం రాత్రి 10 గంటల తర్వాత వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ టైట్ చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి, తిరుపతి ఇతర సమస్యాత్మక ప్రాంతాలలో కేంద్ర భద్రతా బలగాలను ఇప్పటికే మోహరించారు.
కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వెంటనే బయటకు పంపిస్తామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ ను పోలీసులు అమలు చేస్తున్నారు. గెలుపొందిన వారు ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా లో రెచ్చగొట్టే పోస్టింగ్ లు పెడితే రౌడీషీట్లు, పీడీ యాక్ట్ కేసులు పెడతామంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.
Read Also: Counting: వైయస్సార్ జిల్లాలోని కౌంటింగ్ ఏర్పాట్లు ఇవీ..
Actor Hema: రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసుల అదుపులో నటి హేమ
MLC Kavitha: ఈడీ ఛార్జ్ షీట్‌లో కవిత స్టేట్ మెంట్ రికార్డ్
Counting: ఏపీలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. ఏ నియోజకవర్గం ఎన్ని రౌండ్లు?