Tirumala Hills: తిరుమల.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు స్వయంగా వెలసిన క్షేత్రం. ఇక్కడికి ప్రతిరోజూ వేలాది మంది భక్తజనం తరలి వస్తుంటారు. శ్రీనివాసుని సన్నిధికి చేరి మొక్కులు తీర్చుకోవడం, మొక్కుకోవడం చేస్తుంటారు. శ్రీవారిని ఏడుకొండలవాడు అని పిలవడం మనకు తెలిసినదే. అనగా ఏడు కొండలపైన వెలసిన శ్రీహరి అని దీని అర్థం. ఈ కొండలను ఎక్కి శ్రీనివాసుని దర్శించుకోవడం వల్ల ఈతి బాధలు తప్పి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం
కొండపైకి బస్సులు, ట్యాక్సీలపై చాలా మంది వెళ్తుంటారు. చాలా మంది కాలి నడకన కూడా వెళ్లి ఏడు కొండలూ ఎక్కి శ్రీవారిని దర్శించుకుంటారు. కాలి నడకన స్వామిని దర్శించుకోవడం చాలా ప్రత్యేకం. అలిపిరి నడకమార్గం ప్రారంభం నుంచి 3500 మెట్లు ఎక్కితే శ్రీవారి దర్శనం అవుతుంది. దారి పొడవునా గోవింద నామస్మరణలు మనకు వినిపిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో తిరుమల క్షేత్రం ఉంది. ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుమల ఒక పర్వత ప్రాంతం, ఇక్కడ ఏడు కొండలు ఉంటాయి. ఈ ఏడు కొండలకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన పేరు ఉంది. ఆ ఏడు కొండల పేర్లు మరియు వాటి ప్రాశస్త్యం అందరూ తెలుసుకోవాలి.
1. శేషాద్రి: ఈ కొండ శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి శిరస్సుగా చెబుతారు.
2. నీలాద్రి: ఈ కొండ శ్రీనివాసుని భక్తురాలైన నీలాదేవి తపస్సు చేసిన ప్రదేశం.
3. గరుడాద్రి: ఈ కొండ గరుడ మహాసేనుడు శ్రీనివాసుని మోయడానికి వచ్చిన ప్రాంతం.
4. అంజనాద్రి: ఈ కొండ హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి తపస్సు చేసిన చోటు.
5. వృషభాద్రి: ఈ కొండ వృషభాసురుడు అనే రాక్షసుడు శ్రీనివాసునితో యుద్ధం చేసిన ప్రదేశం.
6. నారాయణాద్రి: ఈ కొండ శ్రీనివాసుని స్థిరమైన నివాస స్థానం.
7. వెంకటాద్రి: వేం అంటే పాపం, కట అంటే తీసేయడం. వేంకటాద్రి కొండ ఎక్కితే పాపాలు పోతాయన్నది భక్తుల విశ్వాసం.
ఇవి కూడా చదవండి: YSRCP: జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు: మంత్రి బొత్స
Kangana Ranaut: ఎమర్జెన్సీ మరోసారి వాయిదా.. కంగన మూవీకి రాజకీయ ఆలస్యం!
Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆ మూవీకి నో రెమ్యునరేషన్?
[…] ఇవీ చదవండి: Tirumala Hills: తిరుమల 7 కొండలు ఎక్కడం వల్ల శ్రీ… […]