Pawan Kalyan: విజయవాడ వరద బాధితుల కోసం రూ.కోటి విరాళాన్ని సినీ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇవాళ విజయవాడ కలెక్టరేట్ లో కలిసిన పవన్.. ఈ మేరకు సీఎం సహాయ నిధికి రూ.కోటి చెక్కును అందించారు. పవన్ ఇటీవల జ్వరంతో బాధపడిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి చంద్రబాబు వాకబు చేసినట్లు తెలుస్తోంది.
విజయవాడలో వరద బాధితుల సహాయార్థం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలోని 400 పంచాయతీలకు ఒక్కోదానికి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల సొంత నిధులను ఆయన విరాళంగా ఇస్తానని చెప్పారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని వెల్లడించారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.కోటి అందిస్తానన్నారు. అందులో భాగంగా చంద్రబాబుకు రూ.కోటి చెక్కును ఇచ్చారు.
ఇవీ చదవండి: Gudlavalleru: హిడెన్ కెమెరాల ఆరోపణలపై ఎలాంటి స్పై కెమెరాలు గుర్తించలేదు: ఏలూరు రేంజ్ ఐజీ
Devara: అనిరుధ్ స్పెషల్.. దేవర కొత్త వీడియో సాంగ్ ఇక్కడ చూసేయండి
Mahesh babu: నేనెంతో సంబరపడుతున్నా.. ఎంజాయ్ యువర్ లైఫ్: మహేష్ బాబు
Mohanlal: మలయాళ సినిమా ఇండస్ట్రీని నాయశనం చేయొద్దు.. మోహన్ లాల్